సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని వీరమాచినేని పడగయ్య పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు రాజ్యాంగ విశిష్టతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'భారత దేశ ప్రజలమైన మేము' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత రేడియో అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు హాజరయ్యారు.
పాఠశాలలో 'భారత దేశ ప్రజలమైన మేము' పుస్తకావిష్కరణ - latest news of constitution day celebrations in secunderabad school
భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ సీతాఫలమండిలోని భారత రాజ్యాంగం విశిష్టతను తెలియచేసేలా విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. 'భారత దేశ ప్రజలమైన మేము' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నత స్థానంలో ఉందని వేణుగోపాల్ రావు అన్నారు. ఎన్నో చర్చోప చర్చల అనంతరం బాబాసాహెబ్ అంబేడ్కర్ బృందం రాజ్యాంగాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. భారత రాజ్యాంగంలో చర్చించని విషయం అంటూ ఏదీ లేదని ప్రముఖ అమెరికా రాజ్యాంగ నిపుణుడు చెప్పినట్లు ఆయన తెలిపారు. 290 మంది నిపుణులు అహర్నిశలు కృషి చేసి మూడేళ్లపాటు రాజ్యాంగాన్ని రచించారని దానికి అంబేడ్కర్ నాయకత్వం వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పౌరులందరికీ రాజ్యాంగం తెలిసుండాలి: జస్టిస్ శ్రీదేవి