తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్మాదానం చేసేందుకు ముందుకొచ్చిన కానిస్టేబుళ్లు - Karkana police plasma donation

కరోనా నుంచి కోలుకుని విధుల్లో చేరిన కార్ఖానా కానిస్టేబుళ్లు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకొచ్చారు. వైరస్ బారిన పడి అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా అవసరం ఉన్న వారు తమను సంప్రదించాలని తెలిపారు.

ప్లాస్మాదానం చేసేందుకు ముందుకొచ్చిన కానిస్టేబుళ్లు
ప్లాస్మాదానం చేసేందుకు ముందుకొచ్చిన కానిస్టేబుళ్లు

By

Published : Aug 13, 2020, 5:15 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కార్ఖానా పోలీసులు కరోనాను జయించి, ఇతరులకు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు వచ్చారు. కానిస్టేబుల్ శ్రీకాంత్, రాజ్... వైరస్ నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేశారు. ఇదే బాటలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్, సురేశ్ రాజ్​తో పాటు మహిళా కానిస్టేబుళ్లు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఎవరికైనా ప్లాస్మా అవసరమైతే తాము ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. కరోనా బారిన పడి అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా అవసరం ఉన్న వారు తమను సంప్రదించాలని తెలిపారు. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చిన కానిస్టేబుళ్లను ఇన్ స్పెక్టర్ పి.మధుకర్ స్వామి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details