తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పినా వైద్యం చేయలేదు' - suspect death with corona

తీవ్ర జ్వరంతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. కరోనా లక్షణాలు లేవని... తన సోదరుడికి చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారని... అందుకే చనిపోయాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

constable suspect death with corona at hyderabad
'ఇది వైద్యుల నిర్లక్ష్యమే... లేకుంటే అలా అయ్యేది కాదు'

By

Published : May 21, 2020, 11:59 AM IST

హైదరాబాద్​లోని కుల్సుంపుర పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తీవ్ర జర్వంతో చికిత్స పొందుతూ... బుధవారం మృతి చెందాడు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా... ఆస్పత్రికి వైద్యులు స్పందించలేదని... అందుకే తన సోదరుడు చనిపోయాడని మృతుని సోదరుడు ఆరోపించారు.

''జ్వరంగా ఉందని ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోలేదు. కరోనా లక్షణాలు లేవని వెనక్కి పంపించేశారు. అనంతరం పోలీసుశాఖ తరఫునుంచి వెళ్లినా... వారు చికిత్స అందించలేదు. ఎట్టకేలకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. సోమవారం నుంచి మాతో కాంటాక్ట్​లో కూడా లేకుండా పోయాడు. తన పరిస్థితి బాలేదని డిపార్ట్​మెంట్ వాళ్లు బుధవారం ఉదయం మాకు తెలిపారు. సాయంత్రానికి చనిపోయినట్లు వెల్లడించారు. వాళ్లే అంత్యక్రియలు నిర్వహించారు.''

- సోదరుడు

'ఇది వైద్యుల నిర్లక్ష్యమే... లేకుంటే అలా అయ్యేది కాదు'

ఓ కానిస్టేబుల్​ పరిస్థితే ఇలా ఉంటే... సగటు ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. తన సోదరుడుతో కాంటాక్ట్ అయిన వారికి ఇప్పటి వరకు కరోనా పరీక్షలు చేయలేదని ఆరోపించారు.

ఇవీ చూడండి:సడలించకపోతే ​ఆకలి కేకలు మారుమోగేవి: ప్రధాని

ABOUT THE AUTHOR

...view details