తెలంగాణ

telangana

ETV Bharat / state

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నేటి నుంచే హాల్‌టికెట్లు - Constable Exam News

TSLPRB
TSLPRB

By

Published : Aug 17, 2022, 8:01 PM IST

Updated : Aug 18, 2022, 7:15 AM IST

19:37 August 17

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​టికెట్లు విడుదల

కానిస్టేబుల్‌ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు ఈ నెల 18వ తేదీ నుంచి హాల్‌టికెట్లు జారీచేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈ నెల 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటుచేశారు. అభ్యర్థులు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌ టికెట్లు ‌www.tslprb.inవెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. డౌన్‌లోడ్‌ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే support@tslprb.in కు ఈమెయిల్‌ లేదా 9393711110, 9391005006కు ఫోన్‌ చేయాలని సూచించారు.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

*డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్‌ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.

*అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్‌ తీసుకోవాలి.

*దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్‌ అసమగ్రంగా ఉన్నా అనుమతించరు.

*ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.

*పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్‌ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఉండదు.

*చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు.

*హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.

రుణాలపై వడ్డీ రాయితీ, వారికి మోదీ సర్కార్ గుడ్​న్యూస్

Last Updated : Aug 18, 2022, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details