తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు - constable candidates protest

డీజీపీ కార్యాలయం వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా నిర్వహించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

constable candidates stormed dgp office in hyderabad
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు

By

Published : May 9, 2022, 2:04 PM IST

Updated : May 9, 2022, 2:27 PM IST

కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ... అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని... డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

2020లో వేయాల్సిన నోటిఫికేషన్​ను ప్రభుత్వం రెండేళ్లు ఆలస్యం చేయడంతో... దరఖాస్తు చేయలేక నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డీజీపీ, మంత్రులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అగ్నిమాపక, జైళ్ల శాఖలోని కానిస్టేబుల్స్ పోస్టులకు గతంలో 35 ఏళ్ల వయోపరిమితి ఉంటే... ఇప్పుడు 30ఏళ్లకే కుదించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు
Last Updated : May 9, 2022, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details