Constable Candidates Protest To cancel GO Number 46 : బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS) చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ (Congress) సర్కార్ తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ (Constable Candidates) విద్యార్థుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు.
GO 46 Controversy Telangana : TSSP నియామకాల్లో మంటలు రేపుతున్న జీవో 46
జీవో నెంబర్ 46 విషయంపై రాష్ట్ర మాజీ హోంమంత్రికే అవగాహన లేకుండా బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు చేసిన తప్పిదం వల్ల అనేకమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పలువురు అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 46 రద్దుచేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు విన్నవించారు.
Constable Candidates Protest at dharna Chowk : హైదరాబాద్లో ఉంటున్నవారికి తక్కువ మార్కులు వచ్చినా వారికి ఉద్యోగాలు వస్తున్నాయని, గ్రామాల్లో ఉంటున్న అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రావడం లేదని అభ్యర్థులు వాపోయారు. గ్రామాల్లో పుట్టడమే పాపమా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్లో ప్రజలు మాత్రమే ఓట్లు వేశారా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేదా అని నిలదీశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు.
"జీవో 46ను రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ఆరు నెలలుగా ఈ జీవోను రద్దు చేయాలని కోరుతున్న పట్టించుకోవడం లేదు సీఎం రేవంత్ వెంటనే స్పందించి రద్దు చేయాలని కోరుతున్నాం. దీని వల్ల చాలామంది అభ్యర్థులు నష్టం పోతున్నారు. ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రావడం లేదు అభ్యర్థులను చర్చలకు పిలిచైనా న్యాయం చేయాలి." - కానిస్టేబుల్ అభ్యర్థులు