హైదరాబాద్‌లో కుటుంబ కలహాలతో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నరేష్ గురువారం రాత్రి విధులు ముగించుకుని.. హాయత్నగర్లోని తన ఇంటికి వెళ్తున్నాని చెప్పాడు.
అనంతరం పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి తనకు కుటుంబ సమస్యలు ఉన్నానంటూ.. చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి... గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ఉన్నట్లుగా గుర్తించారు. నరేష్ అప్పటికే పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయినట్లు పోలీసులు గమనించారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.