దేశంలో రిజర్వేషన్లను తీసేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం హెచ్చరించారు. తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘాల నాయకులు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ప్రమాదంలో రాజ్యాంగం- రక్షణకై దళిత బహుజన, ప్రజాసంఘాల -ప్రజాస్వామికవాదుల పాత్ర అనే అంశంపై చర్చించారు.
రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర : గజ్జెల కాంతం
దేశంలో రిజర్వేషన్లను తీసివేసే కుట్ర జరుగుతోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘాలు ఆరోపించాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారని జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం విమర్శించారు. ప్రమాదంలో రాజ్యాంగం అనే అంశంపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కులాలను మోసం చేయడం సరికాదని గజ్జెల కాంతం వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో తీసివేయాలనే కుట్ర, కుతంత్రాలు జరుగుతున్నాయని... దీనివల్ల రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. త్వరలోనే తెలంగాణ ప్రజా సంఘాలు, అంబేడ్కర్ యువజన సంఘం కమిటీలు వేసి జిల్లాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.