తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల పేర్లు జాబితాలో ఉన్నాయని, మెరిట్ విద్యార్థులకు చోటు దక్కలేదని కానిస్టేబుల్ అభ్యర్థులు ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఎంపికలో అవకతవకలను సరిదిద్ది న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకొని గోషామహల్ స్టేడియంకు తరలించారు. వారి ఆందోళన రాత్రి వరకు కొనసాగింది. తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
రోడ్డెక్కిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. - conisatable-candidates arrested at pragathi-bhavan
ప్రగతి భవన్ దగ్గర నిత్యం ధర్నాల పరంపర కొనసాగుతుంది. మొన్న టీఆర్టీ అభ్యర్థులు, నిన్న కాంగ్రెస్ నేతలు, ఇవాళ కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. వారిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. వారి ఆందోళన రాత్రి వరకు కొనసాగింది.
రోడ్డెక్కిన కానిస్టేబుల్ అభ్యర్థులు..