Congress Leaders Protest Telangana Bhavan In Delhi: తెలంగాణలో కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ చేయడంపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్‌రూమ్ సీజ్‌పై ఇవాళ పార్లమెంట్‌లో మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. అంతేకాకుండా దిల్లీలోని తెలంగాణ భవన్‌కు కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్.. ఇతర నేతలు నిరసన చేయనున్నారు. మరోవైపు ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణలు నిరసనలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను పోలీసులు ముందుగానే అడ్డుకుంటున్నారు. ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లు రవితో పాటు మరికొందరు నేతల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యపథంలో ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. తమను హౌస్ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద నిరసనకు దిగనున్న కాంగ్రెస్ నేతలు - Sunil Kanugolu latest news
10:25 December 14
దిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద నిరసనకు దిగనున్న కాంగ్రెస్ నేతలు
అసలేం జరిగిందంటే:నిన్నముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైం పోలీసులు సోదాలు చేశారు. ఫేస్‌బుక్‌లో రెండు పేజీలు నిర్వహిస్తున్న ఆయన బృందం.. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై సునీల్ కనుగోలు కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు తీసుకున్నారు. దాదాపు 6 గంటలు సోదాలు చేసిన అధికారులు హార్డ్‌డిస్క్‌లు, లాప్‌టాప్‌లు, స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసుల సోదాలు
డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయిన బస్సు.. చిన్నారి సహా ఆరుగురు మృతి