తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్​ నాయకుల ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు' - బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు హైదరాబాద్​

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కమిటీ, అభ్యర్థుల ఎంపికలో తామే ముందున్నామని కాంగ్రెస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలిని తీసుకుని.. దేశ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని భాజపా నాయకులను విమర్శించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ అవినీతి చేసినట్లు ఆరోపించారని, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.

'కాంగ్రెస్​ నాయకుల ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు'
'కాంగ్రెస్​ నాయకుల ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు'

By

Published : Nov 21, 2020, 6:16 PM IST

భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పోరాటం చేస్తుందనే చెప్పుకునే పార్టీ.. గుంటకాడ నక్కల్లా కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. బండ కార్తిక రెడ్డి, సర్వే సత్యనారాయణలను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్ చేసి రెండేళ్లు అయిందని.. వారు కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ఎలా అవుతారని నిలదీశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కమిటీ, అభ్యర్థుల ఎంపికలో తామే ముందున్నామని పొన్నం వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలిని తీసుకుని.. దేశ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ అవినీతి చేసినట్లు ఆరోపించారని, ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై తాము చర్చకు సిద్దమన్న ఆయన కేసీఆర్ దేశ ద్రోహి అయితే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రానికి ఏం చేయకపోతే పార్లమెంట్‌లో మోదీకి మద్దతుగా ఎందుకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా పోరాటం చేస్తామని, హైదరాబాద్‌ స్థానం తమదేనని పొన్నం ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:జీహెచ్‌ఎంసీగా హైదరాబాద్‌ ఎలా మారిందో తెలుసా..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details