మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని.. కరోనా వారియర్స్‌ను ఆదుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకొచ్చారు. హైదరాబాద్, ముషీరాబాద్‌లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. జాతీయ సమైక్యతకు పాటు పడిన రాజీవ్ గాంధి ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త అంకిత భావంతో పని చేస్తారని.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేశ్ పేర్కొన్నారు.
వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేసిన కాంగ్రెస్ కార్యకర్తలు - మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని.. హైదరాబాద్, ముషీరాబాద్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు.

rajeev gandhi vardhanthi
రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నరేశ్ కోరారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి:వైద్యుల నిర్లక్ష్యం.. ప్రసవం కోసం గర్భిణుల పడిగాపులు