తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం - greater elections

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ .. ప్రస్తుత ఎన్నికల్లో రెండింటినే గెల్చుకుని ఉనికి చాటుకునే ప్రయత్నం చేసింది.

congress won in two divisions in ghmc
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో రెండు స్థానాలు 'హస్త'గతం

By

Published : Dec 4, 2020, 4:27 PM IST

బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని చాటుకుంది. జీహెచ్​ఎంసీ పోరులో హస్తం పార్టీ మరోసారి ప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ .. ప్రస్తుత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.

హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచి లీడింగ్‌లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాధించారు. ఉప్పల్‌లో మందముల్లా రజిత విజయం సాధించారు.

ఇదీ చూడండి: కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం

ABOUT THE AUTHOR

...view details