Congress Vijayabheri Sabha in Tukkuguda :పార్టీ పేరులో తెలంగాణ లేకుండా చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో ఏం సంబంధమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తానని స్పష్టం చేశారు. హనుమకొండలో నిర్వహించిన విజయభేరి సభ సన్నాహక సమాశంలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 17న తుక్కుగూడకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. తెలంగాణ ఇచ్చినసోనియా గాంధీ సకుటుంబంగా రాష్ట్రానికి వచ్చి సభ నిర్వహిస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు.. కేసీఆర్, మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆక్షేపించారు. కేసీఆర్‌కే కేవీపీ రామచంద్రరావు బంధువు తప్ప తనకు కాదన్నది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. సమైక్యవాదం వినిపించిన ఏపీ సీఎం జగన్‌కి ప్రగతి భవన్‌లో పరమాన్నం పెట్టింది ఎవరని ప్రశ్నించారు.
"రాష్ట్రానికి ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే మీరేమో ప్రగతిభవన్ ప్రారంభోత్సవం రోజున ఆంధ్రా వాళ్లను మీ కుర్చిలో కూర్చోబెట్టి వారి కాళ్లకు దండం పెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోళ్ల కాళ్ల దగ్గర పెట్టివారు ఈ రోజు నా గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం చచ్చే బిడ్డను నేను. ఆ రోజు తెలంగాణకు జగన్ వస్తే తెలంగాణ బిడ్డలు ఎలా సమాధానం చెప్పారో మీరే దానికి సజీవ సాక్షి కదా." - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
Congress Public Meeting in Tukkuguda :హైదరాబాద్ శివారులో తుక్కుగూడ వద్ద ఈనెల17న జరగనున్న విజయభేరి సభ ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. సభ నిర్వహణకు జరుగుతున్న పనులను చూసి నేతలకు పలు సూచనలు చేశారు. వంద ఎకరాలకు పైగా ఖాళీ స్థలాన్ని చదును చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. సభా వేదికతోపాటు మరో రెండు స్టేజీలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఖమ్మం సభను దృష్టిలో పెట్టుకొని భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రతా కారణాల రీత్యా మూడు స్టేజీల పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరని నేతలు తెలిపారు.