తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress : 'సమయం లేదు మిత్రమా.. గెలుపు కోసం అంతా కలిసి రావాల్సిందే..' - టి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక

Telangana Congress Elections Plan 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, బస్సుయాత్ర చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్ణయించింది. నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ఎంపికకు ‘ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ’, పార్టీ మేనిఫెస్టో తయారీకి ‘మేనిఫెస్టో కమిటీ’ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర నేతలంతా కలసి బస్సుయాత్ర చేయడంపై... ఈనెల 23న పార్టీ ‘రాజకీయ వ్యవహారాల కమిటీ’ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Congress
Congress

By

Published : Jul 20, 2023, 7:09 AM IST

Updated : Jul 20, 2023, 7:23 AM IST

'సమయం లేదు మిత్రమా.. గెలుపు కోసం అంతా కలిసి రావాల్సిందే..'

Congress Telangana Elections 2023 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. అధికార బీఆర్​ఎస్​ను దీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. అందులో భాగంగా విస్తృత ప్రచార కార్యక్రమాలతో పాటు బస్సుయాత్ర నిర్వహణ, కీలక కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. వారం, పది రోజుల్లో మేనిఫెస్టో కమిటీ, ప్రదేశ్‌ ఎన్నికల కమిటీలు ప్రకటించనున్నారు. ఈ నెల 30న కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆధ్వర్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సభలు, బస్సుయాత్ర, పాదయాత్రల నిర్వహణ, చేరికలపై ఈ సమావేశంలో చర్చించారు.

Telangana Congress Party Bus Tour :అంతర్గతంగా నేతల చర్చల్లో రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని దాదాపు అందరూ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ‘విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యనాయకులంతా కలిసిమెలిసి పని చేయాలి. చిన్నచిన్న అభిప్రాయ భేదాలుంటే వాటిని చర్చించి పరిష్కరించుకోవాలి’ అని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి దక్షిణ తెలంగాణలో పాదయాత్ర చేస్తే బాగుంటుందని సంపత్‌కుమార్‌ ప్రతిపాదించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున పాదయాత్రల కంటే బస్సు యాత్రలు చేస్తే ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంటుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. బస్సుయాత్ర విడతల వారీగా చేపట్టాలని, నాయకులు ఎవరి వీలును బట్టి వారు యాత్రలో పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు.

Telangana Assembly elections 2023 : ఈ సమావేశంలో.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతల పనితీరుపై సమీక్షలు జరపాలనే ప్రతిపాదన వచ్చింది. చేరికలపైనా చర్చ జరిగింది. బీఆర్​ఎస్​, బీజేపీల నుంచి కొందరు కాంగ్రెస్‌లో చేరేందుకు సానుకూలత వ్యక్తంచేస్తున్నారని.. ఈ అంశంపై పార్టీ నేతలు మీడియాతో ఆచితూచి స్పందించాలని నిర్ణయించారు. ఏ నాయకుడైనా ఇతర పార్టీల నేతలతో చర్చించవచ్చు కానీ, ఆ విషయాలను పీఏసీ దృష్టికి తెచ్చి చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఖమ్మంలో ఇటీవల రాహుల్‌గాంధీ సభ తర్వాత కొంత జాప్యం జరిగిందని.. ఇకపై అలా జరగకుండా తరచూ ఏదో ఒక సభ నిర్వహిస్తూనే ఉండాలని ముఖ్యనేతలు సూచించారు. ఎన్నికల యుద్ధానికి ఇక వంద రోజులే ఉందని, ఇందులో ప్రజలు గెలవాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న సమస్యలున్నా.. అందరం కలిసి పనిచేస్తామని, ఐక్యంగా త్వరలో రాష్ట్రమంతా బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు.

"యుద్ధానికి 100 రోజులే సమయం ఉంది దానిలో గెలవాలి. గెలవాలంటే నాయకులు ఐకమత్యంగా ఉండాలి. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికి వర్గాలుగా కాకుండా కార్యకర్తలు, నాయకులు కలిసిగట్టుగా పని చేయాలి. అందరి అభిప్రాయాలను సేకరించింది.. క్రోడీకరించి వచ్చే సభలో మా కార్యచరణ ఏంటో చెబుతాం. ఈ నెల 30వ తేదీన ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ఇస్తారు. మా కార్యక్రమాలు కొన్నే ఉంటాయి కేసీఆర్​లాగా 100హామీలు ఇచ్చి మాట తప్పం. తెలంగాణ ప్రజలకు నియంత పాలన నుంచి విముక్తి చేయడానికే మా ప్రయత్నం." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ

Congress Party Women Declaration on July 30 : ఈనెల 30న కొల్లాపూర్‌లో నిర్వహించే సభలో ‘మహిళా డిక్లరేషన్‌’ను ప్రియాంక ప్రకటిస్తారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. దమ్ముంటే బీఆర్​ఎస్​ తరఫున బీసీ నేతని సీఎం చేస్తానని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 20, 2023, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details