మహిళలకు రాజకీయ, ఆర్థిక సాధికారత కాంగ్రెస్తోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో మహిళాకాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని కాంగ్రెస్ అందించిందని ఉత్తమ్ స్పష్టం చేశారు. మోదీ, కేసీఆర్ పాలనలో మహిళ సాధికారత కనుమరుగైందని విమర్శించారు. పాలనలో మహిళలను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేద్దామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, మధుయాస్కీ, మహిళా నేతలు శారద తదితరులు పాల్గొన్నారు.
నారీశక్తికి కాంగ్రెస్ అండ - INTERNATIONAL WOMENS DAY
రాష్ట్రంలో స్త్రీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళా కాంగ్రెస్ వారికి అండగా నిలవాలని హస్తం పార్టీ సూచించింది.
టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఇవీ చదవండి :ప్రతి వంట గదిలోనూ ఎల్పీజీ
Last Updated : Mar 9, 2019, 7:47 AM IST