ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్ - భట్టి తలసాని
12:55 September 18
ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శనను కాంగ్రెస్ అర్ధాంతరంగా నిలిపివేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపిస్తామని ఇప్పటి వరకు కేవలం 3,428 ఇళ్లనే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావన్నారు. గ్రేటర్ పరిధిలో వందల ఎకరాల భూమి ఉందిని... అక్కడ కట్టవచ్చని తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో చూపించిన ఇళ్లనే ఇప్పుడు చూపిస్తున్నారని విమర్శించారు.
ఇక్కడ కట్టే ఇళ్లల్లో 90 శాతం జీహెచ్ఎంసీ పరిధి ప్రజలకే ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. స్థలాలు లేకనే నగర శివారు ప్రాంతాల్లో నిర్మించామని తెలిపారు. ఎక్కడ కట్టినా అవి హైదరాబాద్ వాసులకేనని స్పష్టం చేశారు. లక్ష ఇళ్లకు సంబంధించిన లిస్ట్ ఇస్తామంటే కాంగ్రెస్ వాళ్లు పారిపోతున్నారని ఆరోపించారు.