తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగ్గురికి బీఫాంలు తాత్కాలికంగా నిలిపివేసిన కాంగ్రెస్! ఇవాళ మూడోజాబితా ప్రకటించే అవకాశం

Telangana assembly elections 2023
Congress stopped B Forms for three constituencies

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 8:41 PM IST

Updated : Nov 6, 2023, 8:18 AM IST

20:34 November 05

3 నియోజకవర్గాల అభ్యర్థులకు సమాచారమివ్వని పీసీసీ

ముగ్గురికి బీఫాంలను తాత్కాలికంగా నిలుపుదలచేసిన కాంగ్రెస్

Congress Stopped B Forms for Three Constituencies :అసెంబ్లీ ఎన్నికలకుకాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థులకు ఆపార్టీ నాయకత్వం బీ ఫాంలు (Congres B Forms) పంపిణీ చేస్తోంది. రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా బీ ఫాం తీసుకెళ్లాలని 97 స్థానాలకు చెందిన అభ్యర్థులకు.. గాంధీభవన్‌ నుంచి సమాచారంఅందినట్టు తెలుస్తోంది. వనపర్తి, బోథ్‌, చేవెళ్ల స్థానానికి ప్రకటించిన అభ్యర్థులకు మాత్రం బీ ఫాంల సమాచారం ఇవ్వలేదని పార్టీలో చర్చ సాగుతోంది. బోథ్‌ నుంచి వెన్నెల అశోక్‌, వనపర్తి నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, చేవెళ్ల నుంచి భరత్‌కి టికెట్లు దక్కాయి.

ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్

Telangana Congress Candidates B Forms :ఆ ముగ్గురికి బీ ఫాం తీసుకెళ్లాల్సిందిగా.. గాంధీభవన్‌ నుంచి సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది. అభ్యర్థులకు చెందిన బీ ఫాంలను.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌, ఇంఛార్జ్‌ కార్యదర్శులు, పరిశీలకులు పంపిణీ చేయగా.. తొలిరోజు 65 మందికి అందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండోజాబితా ప్రకటన తర్వాత.. టికెట్‌ దక్కని ఆశావహులు తీవ్రఅసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఖరారైన వారికి సహకరించకుండా సహాయనిరాకరణ చేస్తుండగా మరికొందరు పార్టీనే వీడారు. ఇంకొందరు నిరసన బాట పట్టారు.

Ticket Clashes in Telangana Congress :అసంతృప్తులను బుజ్జగించేందుకు.. జానారెడ్డి కమిటీతో పాటు పార్టీనేతలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, కోదండరెడ్డి, మరికొందరు.. ముఖ్య నేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దిగిరాగా.. మరికొందరు వినేందుకు సిద్ధంగా లేకపోవటం, ముగ్గురి వరకు అసంతృప్తులు ఉన్నచోట సర్దిచెప్పటం తలకుమించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేయాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఖరారైన అభ్యర్థులపై సైతం సర్వేలు నిర్వహించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

రెండో జాబితా ప్రకటన అనంతరం, తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల సామర్థాల అంచనాకు జరిపిన సర్వేల్లో 9మందిపై ఆశించిన స్థాయిలో సానుకూలత లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులకు నచ్చజెప్పిన తర్వాత.. ఆ సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు సమాచారం. మునుగోడు అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (KomatiReddy RajagopalReddy) ప్రకటనతో ఇక్కడ టికెట్‌ ఆశించిన.. చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. ఎల్బీనగర్‌లో ముగ్గురు నాయకులను బుజ్జగించి.. ప్రచారకమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీతో కలిసి పనిచేసేట్లుగా చేయడంలో పార్టీ నాయకత్వం సఫలమైంది.

మహేశ్వరం టికెట్‌ తనకే వస్తుందన్న ధీమాతో పారిజాత ప్రచారానికి సిద్ధమైన తరుణంలో.. చివరి క్షణంలో కేఎల్‌ఆర్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఏదేమైనా తాను పోటీచేస్తానని ఆమె ప్రకటించారు. స్థానిక నాయకత్వం సహకారం లేకుంటే గెలుపు కష్టమని భావించి... అభ్యర్థిని మార్చాలని యోచించినా ఆ విషయంలో సీనియర్‌ నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్ టికెట్‌ ఆశించగా.. రాజిరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అసంతృప్తికి గురైన అనిల్‌కుమార్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడా మార్పు చేయాలని చర్చ జరిగినా.. ఆ దిశగా అడుగులు పడేనా అనేది సందేహంగానే మారింది.

Congress MLA Tickets Disputes in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతల పట్టు.. తేలని సీట్లు

Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్‌ మూడోజాబితా ఇప్పటికే కొలిక్కివచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లలోనూ.. పార్టీ అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల పోటీ కారణంగా జాబితా ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. రెండో జాబితాలో కొందరిని మార్చటంతో పాటు.. రెండు, మూడు మినహా మిగతా స్థానాలన్నింటికి ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

బీఆర్​ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు

కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు నష్ట నివారణ చర్యల కోసం రంగంలోకి సీనియర్లు

Last Updated : Nov 6, 2023, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details