తెలంగాణ

telangana

ETV Bharat / state

DASOJU SRAVAN: 'ఇలా చేస్తే కేసీఆర్​కు పాలాభిషేకం చేస్తా' - తెలంగాణ కాంగ్రెస్ తాజా వార్తలు

DASOJU SRAVAN: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్ సూచించారు. 40లక్షల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. చనిపోయిన 70మంది ఫీల్డ్​ అసిస్టెంట్​ల కుటుంబాలను ఆదుకోవాలని శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Dasoju Shravan speaking
మాట్లాడుతున్న దాసోజు శ్రవణ్

By

Published : Mar 17, 2022, 7:47 PM IST

DASOJU SRAVAN: రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న ప్రభుత్వం... మిగిలిన లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని అన్నారు. ఇది 40 లక్షల కుటుంబాల సమస్య.. 90వేల ఉద్యోగాలిచ్చి 39 లక్షల మందికి అన్యాయం చేస్తారా అని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.

"నిరుద్యోగంపై లోతైన చర్చ జరపడంతోపాటు అఖిలపక్షంతో చర్చించాలి. నిపుణులతో టాస్క్ కమిటీ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయట్లేదు? ప్రైవేటు రంగంలో 95శాతం ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకే ఇచ్చేటట్లు మార్పులు తీసుకురావాలి. ఇలా చేస్తే కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తా. ప్రతి నిరుద్యోగి అన్ని పరీక్షలు రాసేటట్లు వయోపరిమితిని పెంచాలని సీఎంకు లేఖ రాస్తా." -దాసోజు శ్రవణ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి

ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టడంతో 70 మంది చనిపోయారని శ్రవణ్‌ కుమార్ అన్నారు. వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. వివిధ శాఖల్లో తొలగించిన మిగతా 42 వేల మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:తెలంగాణకు బుల్డోజర్లు...తెచ్చేందుకు సంజయ్‌ దిల్లీ వెళ్లారు

ABOUT THE AUTHOR

...view details