Congress Speed Up Election Campaign in Telangana : తెలంగాణలో అధికారం తమదేనని పదే పదే ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. రాష్ట్రంపై ఇప్పటికే ప్రత్యేక దృష్టిసారించింది. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా తరలివస్తోంది. ప్రచారానికి వారం రోజులే సమయం మిగిలి ఉండడంతో.. ఇప్పటి వరకు పర్యటించని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే - ఆయన మనవడిని కూడా మంత్రిని చేస్తాడు : రేవంత్ రెడ్డి
నిన్న ఒక్కరోజే.. ఏడు నియోజకవర్గాల్లో మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో స్థానిక అంశాలనే ఎక్కువగా ప్రస్తావించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గజ్వేల్‌లో జరిగిన సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy) .. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్‌ను ఓడించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయనను ఓడిస్తే ఇందిరమ్మ ఇళ్లు ప్రతి పేదవాడికి ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఎన్నికల బరిలో 80 స్థానాలకు ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Congress Top Leaders Election Campaign in Telangana :రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అధిక సంఖ్యలో వస్తున్న కాంగ్రెస్ అగ్రనేతల కోసం.. అవసరమైన ఆరు హెలికాప్టర్‌లను ఇప్పటికే పీసీసీ సిద్ధం చేసింది. నిన్న అలంపూర్, నల్గొండ ప్రచార సభల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjuna Kharge) ..ఈ నెల 25న మళ్లీ తెలంగాణకు రానున్నారు. 26, 27 తేదీల్లో పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఈ నెల 24న రాష్ట్రానికి వస్తున్నారు. 27 వరకు ఇక్కడే ఉండి.. హస్తం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.
తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం