Congress Special Exercise on After Election Counting Situation : తెలంగాణ కాంగ్రెస్‌కు సానుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు(Exit Polls Results) ఉన్నప్పటికీ.. రాష్ట్ర ఫలితాలపై ఏఐసీసీ అప్రమత్తమైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా రేపటి కౌంటింగ్(Votes Counting)ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. అయితే ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులకు స్వయంగా ఫోన్ చేసి ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.
తాజ్ కృష్ణలో ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం : 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులను హైదరాబాద్‌కు రప్పించాలని చూస్తోంది. వారందరికీ తాజ్ కృష్ణాలో ఏఐసీసీ ప్రతినిధులు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జార్జ్, మంత్రి బోసురాజు, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, రమేష్ చిన్నితల, దీపాదాస్ మున్సీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, బీసీ విష్ణునాథ్‌లు హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్య ఎన్నికల ఏజెంట్‌కు ఎమ్మెల్యే ధ్రువపత్రాలు తీసుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఈసీ వికాస్‌రాజ్(Vikasraj)ను కోరారు. అందుకు ఆయన అలాంటి వెసులుబాటు ఏదీ లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ - వేల కోట్లు దారి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ : భట్టి విక్రమార్క