తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలకు కాంగ్రెస్​ ప్రత్యేక బస్సు ఏర్పాటు - uttam kumar reddy started a bus for migrants

కాంగ్రెస్‌.. మాటలు చెప్పే పార్టీ కాదు చేతల్లో చూపే పార్టీ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. వలస కూలీలను సొంతూళ్లకు పంపించేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు కాంగ్రెస్​ నేతలు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం గాంధీభవన్​ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఒడిశాకు చెందిన 24 మంది వలస కూలీలను పంపించారు.

వలస కూలీలకు కాంగ్రెస్​ ప్రత్యేక బస్సు ఏర్పాటు
వలస కూలీలకు కాంగ్రెస్​ ప్రత్యేక బస్సు ఏర్పాటు

By

Published : May 17, 2020, 8:18 PM IST

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సొంత ఖర్చులతో వలస కూలీలను తరలించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక రైళ్లకు తమ వంతు ఆర్థిక సహాయం చేస్తామన్నా... రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల బస్సుల్లో స్వరాష్ట్రాలకు పంపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం ఒడిశాకు చెందిన 24 మంది వలస కూలీలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పంపించారు. హైదరాబాద్​ గాంధీభవన్‌ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తున్నట్లు ఉత్తమ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌.. మాటలు చెప్పే పార్టీ కాదు చేతల్లో చూపుతుందన్నారు.

ఇవీ చూడండి:'తాతకి దగ్గడం నేర్పినట్లున్నాయ్ వాళ్ల చేతలు

ABOUT THE AUTHOR

...view details