కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సంతాప సభ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు మధుయాష్కీ, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అలా చేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుంది: వీహెచ్ - హనుమంతరావు వార్తలు
పార్టీని నమ్ముకుని... పదవులు ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సూచించారు. ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సంతాప సభలో వీహెచ్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఎన్నో కీలక పదవులు చేపట్టిన ఆయన... పార్టీ అధిష్ఠానానికి ఎప్పుడు కట్టుబడి ఉండేవారని వీహెచ్ గుర్తు చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉంటూ... ప్రజలకు సేవ చేసేవారికి ఆయన ఎప్పుడూ మొదటి స్థానం ఇచ్చేవారని... ప్రస్తుతం వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే... పటేల్ లాగా పార్టీ నమ్ముకొని పదవుల కోసం పాకులాడకుండా పని చేస్తేనే... పార్టీ బలోపేతం అవుతుందని వీహెచ్ తెలిపారు.
ఇదీ చూడండి:సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి