TS Congress seniors meeting:రాష్ట్రకాంగ్రెస్‌లో విబేధాలు భగ్గుమన్న వేళ రేపు సీనియర్ నాయకులు అంతా ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించడం ఉత్కంఠ రేపుతోంది. కొంతకాలం నుంచి పార్టీకార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి నిన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. ఆ తర్వాత పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీతో విష్ణు సమావేశం కాగా..ఆయా భేటీల్లో ప్రస్తుత పీసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తోంది.
పీజేఆర్ కుమారుడి ఇంట్లో... రేపు కాంగ్రెస్ సీనియర్ల భేటీ! - TS Congress seniors meeting tomorrow
TS Congress seniors meeting:తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లు అందరూ భేటీ కావాలని నిర్ణయించడం ఉత్కంఠ రేపుతోంది. రేపు విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో సీనియర్లు ప్రత్యేకంగా హాజరుకానున్నారు. జానా, వీహెచ్, భట్టి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి సహా పలువురు హాజరుకానున్నారు.
![పీజేఆర్ కుమారుడి ఇంట్లో... రేపు కాంగ్రెస్ సీనియర్ల భేటీ! Congress seniors meeting tomorrow in pjr son vishnu vardhan home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15735983-thumbnail-3x2-kee.jpg)
సీనియర్ నాయకులంతా ప్రత్యేకంగా కలిసి చర్చించుకోవాలనే అభిప్రాయం వ్యక్తంకాగా తానే బోజనానికి ఆహ్వానిస్తానని, అందుకు అవకాశమివ్వాలని భట్టి విక్రమార్కను విష్ణు కోరినట్లు సమాచారం. ఈ మేరకు రేపు మధ్యాహ్నం దోమలగూడలోని విష్ణు ఇంట్లోనే పార్టీ విధేయులు... ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్టు తెలిసింది. ఆ సమావేశానికి రావాలని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్ సహా 15 మంది హాజరవుతారని తెలుస్తోంది.
ఇవీ చదవండి: