తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: వీహెచ్​ - telangana varthalu

సీఎం కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు డిమాండ్​ చేశారు. ఈబీసీ సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: వీహెచ్​
ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: వీహెచ్​

By

Published : Feb 3, 2021, 3:44 PM IST

ఈబీసీ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్‌‌కు చిత్తశుద్ధి ఉంటే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

ఈ నెల 5న సోమాజీగూడలో అన్ని కులాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, అక్కడకు వచ్చి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని వీహెచ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే బౌలింగ్​లో మంత్రి బౌండరీలు

ABOUT THE AUTHOR

...view details