తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి బడుగు, బలహీన వర్గాలకు ఇవ్వాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు (VH) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పూర్తి స్థాయిలో అంచనాలు వేసి.. సరైన నాయకత్వం అందించే పీసీసీని ఎంపిక చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని.. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ నల్ల చట్టాలని వ్యతిరేకించడం లేదని ఆయన ప్రశ్నించారు.
VH: పీసీసీ పదవి బలహీన వర్గాలకే ఇవ్వాలి: వీహెచ్ - కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తాజా వార్తలు
బడుగు, బలహీన వర్గాలకే రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ భాజపాలో చేరుతుండటం ఆశ్చర్యం కల్గిస్తోందని అన్నారు.

పీసీసీ పదవి బలహీన వర్గాలకే ఇవ్వాలి: వీహెచ్
ఈటల రాజేందర్ మొదట కాంగ్రెస్ నాయకులనే కలిశారని... తమ పార్టీ నాయకుల వైఖరి కారణంగానే దగ్గర చేసుకోలేకపోయినట్లు వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. లెఫ్ట్ భావజాలం కలిగిన ఈటల భాజపాలో చేరుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అందరూ భాజపాలోనే చేరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రావడం లేదో ఆలోచన చేయాల్సి అవసరం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి :ఆనందయ్య మందు.. కోటయ్య మృతి