తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ పాలన: వీహెచ్​ - ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ పాలన: వీహెచ్​

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. శనివారం భద్రాచలంలో తనపట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ... ఆయన నివాసంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

congress-senior-leader-vh-one-day-inmates-at-him-home-hyderabad
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ పాలన: వీహెచ్​

By

Published : Jun 14, 2020, 2:02 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఈ రకమైన పాలనకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు.

'శనివారం భద్రాచలంలో ఎమ్మెల్యే పొడెం వీరయ్యను నేను కలవకుండా అడ్డుకున్నారు. అక్కనుంచి బలవంతంగా తరలించారు. ఎమ్మెల్యే వీరయ్యను గృహ నిర్బంధం చేశారు. మేము ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే అరెస్టులు చేస్తారు. మీరు మాత్రం కొండపోచమ్మ పేరుతో గోదావరి జలాలపై గొప్పలు చెప్పుకుంటున్నారు'. అని వీహెచ్​ ఆరోపించారు.

ఇందుకు నిరసనగా హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​తో కలిసి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ పాలన: వీహెచ్​

ఇదీ చూడండి:'కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. చంపేశారు'

ABOUT THE AUTHOR

...view details