రాష్ట్రంలో 36 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేస్తామన్న మాటను ప్రభుత్వం ఆచరణలో చూపలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు ఆరోపించారు. ఇప్పటివరకు కొన్ని బీసీ కులాలకు కేటాయించిన స్థలాలకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై ఉప్పల్, మేడిపల్లి ఎమ్మార్వోలను కలిసి చర్చించినట్లు ఆయన తెలిపారు.
ఆచరణలో లేని ముఖ్యమంత్రి మాట: వీహెచ్ - బీసీ సంక్షేమ భవనాలపై వీహెచ్
బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి కేసీఆర్... ఆచరణలో చూపలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు.
ఆచరణలో లేని ముఖ్యమంత్రి మాట: వీహెచ్
వివిధ సంఘాలకు భూమిని కేటాయిస్తూ... బీసీ శాఖకు అందచేసినట్లు రెవెన్యూ అధికారులు తెలియచేసినట్లు వివరించారు. ప్రభుత్వం 36 బీసీ కులాలకు 67 ఎకరాల స్థలాన్ని రూ.60 కోట్ల నిధులు కేటాయిస్తూ రెండేళ్ల కిందట 2018లో ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదన్న ఆయన బీసీ కులాల నాయకులతో, సంఘాల ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రితో చర్చిస్తానని వీహెచ్ తెలిపారు.