ధరణి చట్టంలో భూకబ్జాల మీద స్పష్టత లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు తెలిపారు. అంబర్‌పేట్‌లోని తన నివాసంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి... పలు అంశాలపై చర్చించారు. భూ కబ్జాలు చేసే వారికి శిక్షపడేలా చట్టం తీసుకురావాలని సూచించారు. గ్యాస్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు.
'భూ కబ్జాలు చేసే వారికి శిక్ష పడేలా చట్టం తీసుకురావాలి' - తెలంగాణ వార్తలు
భూ కబ్జాలు చేసే వారికి శిక్ష పడేలా చట్టం తేవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ప్రభుత్వానికి సూచించారు. గ్యాస్ ధరల పెంపుపై కేంద్రాన్ని... రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాల్సిన అవసరముందని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని కోరారు.
'భూ కబ్జాలు చేసే వారికి శిక్ష పడేలా చట్టం తీసుకురావాలి'
పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని కోరారు. గతంలో బీసీలు అధ్యక్షులుగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే... వారు పార్టీలు మారుతున్నారని తెలిపారు.
ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల