ఈటలపై ఎంత శరవేగంగా విచారణ చేస్తున్నారో.. అదేవిధంగా భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూములు ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిపై విచారణ జరపాలని సీఎంను కోరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
భూ ఆక్రమణదారులందరీపై వేగంగా చర్యలు తీసుకోండి: వీహెచ్ - విాచారణకు హనుమంతరావు డిమాండ్
రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈటలపై విచారణ జరుగుతున్నట్లుగా అందరిపై అదేవిధంగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
![భూ ఆక్రమణదారులందరీపై వేగంగా చర్యలు తీసుకోండి: వీహెచ్ congress senior leader VH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11639002-647-11639002-1620129463318.jpg)
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు
ఈటల తప్పు చేసినట్లయితే చట్టపరంగా న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పలువురి అవినీతి బాగోతంపై లేఖలు రాసినట్లు వెల్లడించారు. కీసరలో భూములు కొల్లగొట్టిన పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరువును కబ్జా చేసినట్లు ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక ఇచ్చారని వీహెచ్ పేర్కొన్నారు.