పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల తీరును పరిశీలిస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం పెరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ బలోపేతం కావాలంటే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలని అధిష్ఠానానికి ఆయన సూచించారు.
కాంగ్రెస్ బలోపేతానికి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: వీహెచ్ - ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయాలన్న వీహెచ్
కాంగ్రెస్ బలోపేతం కావాలంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేత వీహెచ్ అధిష్ఠానానికి సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల తీరును పరిశీలిస్తే మార్పు స్పష్టంగా కనిపించిందని తెలిపారు. విశాఖ ఉక్కు కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ బలోపేతానికి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: వీహెచ్
ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష చేయాలని వీహెచ్ కోరారు. రైతు ఉద్యమం, విశాఖ ఉక్కు పోరాటాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదన్న వీహెచ్ ప్రజలు తిరగబడాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఏకమై విశాఖ ఉక్కు కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.