తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్‌ - విశాఖ స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేటు పరం చేయొద్దని వీహెచ్​ లేఖ

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ఇనుప ఖనిజం అందుబాటులో ఉందని... అలాంటప్పుడు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్‌
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్‌

By

Published : Mar 2, 2021, 2:16 PM IST

ఇనుప ఖనిజం అందుబాటులో ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ ప్రశ్నించారు. పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత్వం... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని వీహెచ్​ ఆరోపించారు. ఈ చర్యల వల్ల రిజర్వేషన్లను పొందే వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని... ఉన్న ఉద్యోగాలు కూడా తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్‌

ఇదీ చూడండి:'ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details