కేంద్ర వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణల బిల్లు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాలు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు వి.హనుమంతరావు మద్దతు తెలిపారు. రైతుల దీక్షకు మద్దతుగా దిల్లీ వెళ్లి దీక్షలో పాల్గొంటానని వీహెచ్ అన్నారు.
దేశ చరిత్రలోనే దిల్లీలో వినూత్న రీతిలో సాగుతున్న రైతు ఉద్యమానికి... రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ సంపూర్ణ మద్దతుతో పాటు ఆందోళనల్లో భాగస్వామ్యమైందని వీహెచ్ ప్రకటించారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, రాజా... ఉద్యమానికి తోడుగా ఉన్నారని తెలిపారు. రైతు సంక్షేమం, లాభదాయమైన ఉత్తమ చట్టాలు అంటున్న ప్రధాని మోదీ... అదే నిజమైతే దిల్లీసహా దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసన చేస్తారని ప్రశ్నించారు.