ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటిలా వ్యవహరించి ఉంటే పోరాటం చేయగలిగే వారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు: వీహెచ్ - Telangana state 6th Formation day
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
![కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు: వీహెచ్ Congress senior leader V. Hanumantha rao fires on CM KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7445681-834-7445681-1591094665552.jpg)
కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారు: వీహెచ్
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకు ముందు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద వీహెచ్ పుష్పగుచ్చాలు ఉంచి అమరులకు ఘనంగా నివాళులర్పించారు.