హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చించేందుకు ఈ నెల 17న రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు వెల్లడించారు. 2019 నుంచి అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై పోరాటం చేస్తున్న ఆయన ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
vh: ఈ నెల 17న పలు పార్టీల నేతలతో వీహెచ్ సమావేశం - ఈ నెల 17న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సమావేశం
ఈ నెల 17న రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ఈ భేటీలో పంజాగుట్ట సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తామన్నారు.
![vh: ఈ నెల 17న పలు పార్టీల నేతలతో వీహెచ్ సమావేశం vh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12141636-1057-12141636-1623756683736.jpg)
vh
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలకు కూడా స్థలం దొరకదని వీహెచ్ పేర్కొన్నారు. సర్కారు భూముల వేలాన్ని ఆపాలని తెరాస ప్రభుత్వానికి సూచించారు. బడుగు, బలహీన వర్గాలకు పీసీసీ ఇవ్వాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య