తెలంగాణ

telangana

ETV Bharat / state

'వలస కూలీల కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధం' - migrant workers issue

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనతో దీక్ష చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావుకి... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వలస కార్మికులకు తగిన న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

congress-senior-leader-v-hanumanth-rao-on-central-and-state-government
'వలస కూలీల కోసం ఆమరణ దీక్షకైనా నేను సిద్ధం'

By

Published : May 17, 2020, 7:04 PM IST

దేశవిభజన సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో... ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వలసకార్మికులకు న్యాయం జరగకపోతే... తాను ఆమరణ దీక్షకు దిగనున్నట్లు కాంగ్రెస్​ సీనియర్ నేత వి.హనుమంతురావు హెచ్చరించారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరు వలసకార్మికుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకే పరిమితం అవుతున్నారన్నారని, వలస కార్మికులకు నిల్వ నీడ లేకపోగా... కనీసం తినేందుకు తిండి లేదని ధ్వజమెత్తారు.

గాంధీభవన్‌లో ఉదయం నుంచి నిరసన దీక్ష నిర్వహిస్తున్న వి.హనుమంతురావుకు నిమ్మరసం ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలు దీక్ష విరమింపజేశారు. వలస కార్మికుల సమస్యపై ఆందోళనలు, నిరసనలు చేసిన వీహెచ్​ను ప్రశంసించారు.

'వలస కూలీల కోసం ఆమరణ దీక్షకైనా నేను సిద్ధం'

ఇవీ చూడండి:'తాతకి దగ్గడం నేర్పినట్లున్నాయ్ వాళ్ల చేతలు'

ABOUT THE AUTHOR

...view details