ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆసుపత్రుల్లోని బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటన దురదృష్టకరం: వీహెచ్
ఏపీలోని విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు స్పందించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ఫార్మా కంపెనీలు సైతం జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
వీ హన్మంతరావు
ఈ ఘటనలో బాధ్యులెవరో నిగ్గు తేల్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఫార్మా కంపెనీలు సైతం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని కందుకూరు ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నారని... ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి