తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్పుడేం చేస్తున్నారంటే...! - స్వగ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి

కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి. స్వగ్రామంలో దేవాలయ నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటున్నారు.

raghuveera
raghuveera

By

Published : Jan 17, 2020, 1:34 PM IST

సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన ఏపీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన నీలకంఠపురం గ్రామంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందిన కొన్ని రోజుల తర్వాత పార్టీ అధిష్టానానికి రఘువీరా రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామాను సమర్పించారు. అప్పటినుంచి ఇప్పటివరకు తన స్వగ్రామంలో దేవాలయ నిర్మాణంలో, వ్యవసాయ పనిలో నిమగ్నమై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్పుడేం చేస్తున్నారంటే...!

ఇదీ చదవండి: పూర్వ విద్యార్ధుల సమ్మేళనం... గురువులకు సన్మానం..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details