ఎన్నికల శాతాలు కచ్చితంగా ప్రకటించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి విమర్శించారు. భారీగా పెరిగిన పోలింగ్ శాతం వల్ల ఒక పార్టీకి లబ్ధి చేకూరుతోందన్నారు. పోలింగ్ సరళి సరిగ్గా లేదన్న మర్రి... 16 స్థానాల్లో గెలుస్తామని తెరాస చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఖమ్మం, చేవెళ్లలో ప్రతి పోలింగ్ బూత్ లో ఓటింగ్ శాతం.. వీడియో క్లిప్పింగ్స్‌తో వివరాలు ఇవ్వాలని రజత్ కుమార్‌ను కోరినట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
'ఎన్నికల శాతాలు ప్రకటించడంలో ఈసీ పూర్తిగా విఫలం' - మర్రి శశిధర్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాలు ఉన్నాయి. కచ్చితంగా ప్రకటించడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. చాలామంది పోలింగ్ ఏజెంట్స్‌కు 17సీ ఫామ్ ఇవ్వలేదు.: మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత

మర్రి శశిధర్ రెడ్డి
పోలింగ్ సరళి సరిగ్గా లేదన్న మర్రి శశిధర్‌రెడ్డి
ఇదీ చదవండి : అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి