తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావడంలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎందుకు రద్దు చేశారో అర్థం కావడంలేదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక భాగమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు: వీహెచ్ - కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు వార్తలు
పీవీ భూ సంస్కరణలు అమలు అయితేనే... నిజమైన శతజయంతి ఉత్సవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎందుకు రద్దు చేశారో అర్థం కావడం లేదని... ప్రజాస్వామ్యంలో మీడియా ఒక భాగమని ఆయన పేర్కొన్నారు.
రెవెన్యూ వ్యవస్థ గురించి తానిచ్చిన లేఖపై సీఎం స్పందించడం హర్షణీయమన్నారు. ఈ చట్టంలో చాలా అవకతవకలు ఉన్నాయన్నారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన వీహెచ్... ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కీసర ప్రాంతంలో 94 ఎకరాలు దళితుల భూమి అక్రమణకు గురైందని ఆరోపించారు. పీవీ భూ సంస్కరణలు అమలు అయినప్పుడే... నిజమైన శతజయంతి ఉత్సవాలని వీహెచ్ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం పేదలకు న్యాయం చేసే విధంగా ఉండాలన్నారు.
ఇదీ చూడండి:పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం