Congress Screening Committee to Meet on 20th September : రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం దరఖాస్తులు చేసిన 1006 మంది ఆశావహులను వడపోత పోసిన పీసీసీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ(PCC Pradesh Election Committee).. 200 నుంచి 300 వరకు పేర్లతో కూడిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ(Screening committee)కి నివేదించింది. 29 మంది సభ్యులు వడపోతలో పాల్గొని.. 550 పేజీల జాబితా పుస్తకంలో నియోజకవర్గాల వారీగా బలమైన నేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ వివరాలు బయటకిరాకుండా అప్పటికప్పుడు సీజ్ చేసి.. ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి రోహిత్‌చౌదరి ఆధీనంలో ఉంచుకున్నారు. ఈనెల 6న తాజ్‌కృష్ణలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో..ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదించిన జాబితా అందించినా.. కేవలం విధివిధానాలపై మాత్రమే చర్చించారు. మరోసారి సమావేశమై నియోజకవర్గాల వారీగా వచ్చిన పేర్లను పరిశీలించి బలమైన అభ్యర్థులతో స్క్రీనింగ్ కమిటీ ఓ జాబితా సిద్ధం చేసి సీఈసీకి నివేదించనుంది.
Congress Vijayabheri Sabha Arrangements : చరిత్రలో నిలిచేలా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ..!
Telangana Assembly Election Congress Plan :35కుపైగా నియోజకవర్గాల్లో.. ఒకే పేరు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. మరో 40చోట్ల రెండు పేర్లతో పీఈసీ(PEC) సభ్యులు.. ప్రతిపాదించినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మూడు పేర్లతో ప్రతిపాదనలు ఉండగా.. నాలుగు పేర్లతో ప్రతిపాదనలు చాలా తక్కువగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. తొలుత ఈనెల18 లేదా 19న సమావేశం నిర్వహించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఐతే ఆ రెండు తేదీలు సాధ్యం కాదని అంచనా వేసుకున్న కమిటీ.. ఈ నెల 20న సమావేశం కావాలని నిర్ణయించింది. ఆ సమావేశం తర్వాత కొన్నింటిని ఎంపిక చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తారు. యాభైకిపైగా నియోజక వర్గాలకు కాంగ్రెస్ కేంద్ర కమిటీ తొలి జాబితాలోనే అభ్యర్ధుల్ని ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.