తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రో ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం: కాంగ్రెస్

పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ... గాంధీభవన్​ నుంచి హైదరాబాద్​ కలెక్టరేట్​ వరకు కాంగ్రెస్​ శ్రేణులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పెట్రో ధరలు పెంచడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress protests over petrol and diesel price hike
పెట్రోల్​, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన

By

Published : Jun 29, 2020, 12:23 PM IST

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. గాంధీభవన్ నుంచి హైదరాబాద్​ కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కొందరిని మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.

వరుసగా పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని.. ఆ పార్టీ సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్ యాదవ్‌, దాసోజు శ్రవణ్‌ డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ... పెట్రోలియం ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?

ABOUT THE AUTHOR

...view details