తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరల పెరుగుదలను నిరసిస్తూ వినూత్న నిరసన - సామాన్యులపై పెనుభారం

నిత్యావసరాల ధరలు పెంచి.. కేంద్రం సామాన్యులపై పెనుభారం మోపుతోందని కాంగ్రెస్‌ మండి పడింది. పెరిగిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ గాంధీభవన్‌ ఎదుట ఆందోళన చేపట్టింది. గృహిణులపై అర్థిక భారం పడుతోందని మైనార్టీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

congress protested against the increase in cooking gas prices infront of Gandhi Bhavan
'కేంద్రం సామాన్యులపై పెనుభారం మోపుతోంది'

By

Published : Feb 17, 2021, 9:32 AM IST

ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ప్రధాని మోదీకి.. పేదల కష్టాల విలువ తెలియదంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. పెరిగిన వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ హైదరాబాద్ గాంధీభవన్‌ ఎదుట నిరసన చేపట్టింది. నేతలు పీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిత్యావసరాల ధరలు పెంచి.. కేంద్రం సామాన్యులపై పెనుభారం మోపుతోందని మైనార్టీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను.. సిలిండర్‌ కొనుగోలు చేయలేని స్థితికి దిగజార్చారని విమర్శించారు. తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'భాజపా చేసిన అభివృద్ధి చూపిస్తే ముక్కు నేలకు రాస్తా'

ABOUT THE AUTHOR

...view details