గాంధీ విగ్రహంపై అఖిల భారత హిందూ మహాసభ కార్యదర్శి తూటాలు పేల్చడంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.
aicc kisan cell
By
Published : Feb 4, 2019, 8:24 PM IST
గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన
అరాచక శక్తులకు మోదీ ప్రభుత్వం తెరవెనుక సహకరిస్తుందని ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. గాంధీ విగ్రహంపై అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి పూజా శకున్పాండే తూటాలు పేల్చడంపై .... హైదరాబాద్ గాంధీ భవన్లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. అధికారమే పరమావధిగా ప్రధాని పాలన సాగిస్తున్నారని కోదండ రెడ్డి విమర్శించారు.