గత నెలలో వచ్చిన వరదల కారణంగా ముంపునకు గురైన వారికి తక్షణం వరద సాయం అందించాలని డిమాండ్ చేస్తూ.. సరూర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.
వరద సాయం తక్షణమే అందించాలని కాంగ్రెస్ ధర్నా - Congress protest for flood relief latest news
సరూర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. వరద సాయం తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.
వరద సాయం తక్షణమే అందించాలని కాంగ్రెస్ ధర్నా
స్థానికులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నేతలు.. గతంలో కొందరికి వరద సాయం అందించారని.. మిగతావారికి తక్షణ సాయం అందేలా చూడాలంటూ... ధర్నాకు దిగారు. అధికారులు వెనువెంటనే ఆధార్‌కార్డు వివరాలు, అకౌంట్ సమాచారాన్ని సరిచూసి.. సాయం డబ్బును అందించాలని కోరారు. ఇప్పటికే ఆలస్యం అవ్వడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇవీచూడండి:ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక కొట్టివేయండి: తెలంగాణ