తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2021, 12:21 PM IST

Updated : Jul 16, 2021, 12:46 PM IST

ETV Bharat / state

CONG DHARNA: పెట్రో సెగపై కాంగ్రెస్ మహాధర్నా

పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ధరలు ఎందుకు పెంచిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

congress protest at indira park against petrol rates
కాంగ్రెస్ నిరసన

పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్​భవన్​ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల పహారాతో ఇందిరాపార్క్ కిటకిటలాడింది. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు... ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున్న ఇందిరాపార్క్ ధర్నాచౌక్​ వద్దకు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, మల్లు రవి, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్ నాయకులు తదితరులు హాజరయ్యారు.

కాంగ్రెస్ నిరసన

యూపీఏ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే గగ్గోలు పెట్టిన భాజపా... ఇప్పుడు ఏ విధంగా పెట్రోల్ ధరలు పెంచుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉంటే.. మోదీ ప్రభుత్వం ధరలు ఎందుకు పెంచిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. 40 రూపాయలకు దొరికే పెట్రోల్​ను 65 రూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక, సరైన ఆర్థిక స్థితి లేని సమయంలో మోదీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచడం సరికాదు. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

-సీతక్క ఎమ్మెల్యే

పెరిగిన ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ రాజ్​భవన్​కు పిలుపు ఇస్తే అనుమతి ఇవ్వకపోగా.. పార్టీ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని సీతక్క దుయ్యబట్టారు. టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు పాదయాత్ర చేసుకుంటూ... నిత్యావసర ధరలు నిరసిస్తూ కూరగాయల బుట్టతో ధర్నాచౌక్​ చేరుకున్నారు. ఇందిరా పార్కు నుంచి రాజ్​భవన్​ వరకు ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ఇదీ చూడండి:Chalo Raj bhavan: ఎక్కడికక్కడ ముళ్లకంచెలు.. రాజ్​భవన్​ గేటుకు కాంగ్రెస్​ జెండాలు!

Last Updated : Jul 16, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details