Electricity War Between BRS And Congress :తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్ అంశం తెరమీదకు వచ్చింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు అవకాశంగా మలుచుకుంటున్నారు. కాంగ్రెస్ మరోసారి రైతులపై తమ నియంతృత్వ విధానాలను బయటపెట్టిందని గులాబీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు సైతం స్పందిస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలకు తప్పుగా అర్థంవచ్చేలా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జీ మాణిక్ రావు ఠాక్రే ధ్వజమెత్తారు. రైతులు, వ్యవసాయానికి చెందిన ఏ విషయంలో అయినా కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆ విషయాన్ని వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌లో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులకు కేసీఆర్ సర్కారు చేసిన దానికంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కువే చేసి చూపిస్తామని చెప్పారు.
- Congress Protest Against BRS : 'రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే.. దేనికైనా సిద్ధం'
- KTR Tweet Today : '3 పంటలా.. 3 గంటలా.. మతం పేరిట మంటలా.. ఏం కావాలో రైతులే తేల్చుకోవాలి'
Revanth comments on free Current : కాంగ్రెస్ వ్యాఖ్యలపై కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎంత దుష్ప్రచారం చేసినా.. బీఆర్ఎస్ ఈసారి అధికారంలోకి రావడం కల అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 'కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా… మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్' అంటూ ట్వీట్ చేశారు.