తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి' - ధర్నా చౌక్​లో కాంగ్రెస్​ దీక్ష

దిల్లీలో రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్​ నేతలు చేపట్టిన రైతు దీక్ష ముగిసింది. ఈ దేశ ప్రజాస్వామ్యానికి నూతన వ్యవసాయ చట్టాలతో ప్రమాదం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సంక్రాంతి తర్వాత తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

bhatti vikramarka, congress
భట్టి విక్రమార్క, కాంగ్రెస్​ దీక్ష

By

Published : Jan 9, 2021, 7:13 PM IST

దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా హైదరాబాద్​లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్​లో కాంగ్రెస్​ చేపట్టిన రైతు దీక్ష ముగిసింది. పోరాటానికి మద్దతుగా రైతుల కోసం సేకరించిన రూ. 4 లక్షలతో పాటు కాంగ్రెస్​ నేతల నెల జీతం కలిపి రైతులకు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తామని భట్టి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. తమతో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం తెరాస ప్రభుత్వంపై భట్టి ధ్వజమెత్తారు. పరిపాలనను సీఎం కేసీఆర్​ వ్యాపారంలా చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'

ఇదీ చదవండి:'వ్యవసాయ చట్టాల రద్దు ప్రజాస్వామ్యానికే ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details