తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతిపక్షాల విమర్శలపై ఎదురుదాడికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్ - కార్యాచరణ సిద్ధం! - కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు

Congress Prepares Counter Attack on Opposition Parties : ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాక ముందు నుంచే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఎక్కడికక్కడ అడ్డుకోడానికి రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్​ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టేట్లు రాష్ట్ర నాయకత్వం పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేసింది.

Congress Prepares Counter Attack on Opposition Parties
Congress Prepares Counter Attack

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 7:58 AM IST

Updated : Jan 8, 2024, 11:24 AM IST

విపక్షాలపై ఎదురుదాడికి కాంగ్రెస్ సిద్ధం- విమర్శలను తిప్పికొట్టేందుకు దిశానిర్దేశం

Congress Prepares Counter Attack on Opposition Parties :తెలంగాణలో కాంగ్రెస్ పార్టీఅధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్​రెడ్డి పాలనాపరంగా ప్రక్షాళన దిశలో ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటిని చక్కపెట్టే దిశలో చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థలు ప్రక్షాళన జరిగితే తప్ప పాలనపరంగా పారదర్శకత వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

Congress Six Guarantees in Telangana :ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు జరుగుతోంది. టీఎస్​పీఎస్సీ (TSPSC) ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది.

నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచిన కాంగ్రెస్ - ఈ సంక్రాంతికే పూర్తి చేసేలా చర్యలు

Congress Govt Focus on Rythu Bandhu and Rythu Runamafi : ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించే దిశలో చర్యలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నాలుగో తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చింది. అందుబాటులో ఉన్న నిధులను రైతుబంధు(Rythu Bandhu) కింద రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు రైతు రుణమాఫీ(Rythu Runamafi) రెండు లక్షల వరకు ఒకేసారి చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. రూ.30 వేల కోట్ల వరకు రైతు రుణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమవుతోంది. బ్యాంకులకు విడతల వారీగా చెల్లించి రైతుపై ఉన్న రుణభారాన్ని తొలగించే దిశలో కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం పాలనాపరంగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది.

ఎన్నికలకు ముందా? ఆ తర్వాతా? - తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై జోరుగా చర్చ

Congress Government in Telangana : ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంపై విపక్షాలు విమర్శలు చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని, రెండు లక్షల రుణమాఫీ చేయలేదని, ఎయిర్‌పోర్టు మెట్రో, ఫార్మాసిటీ ప్రాజెక్టులు రద్దు చేస్తోందని, ప్రభుత్వం కూలుతుందని ఇలా ప్రతి అంశంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది.

వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాలని ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ ​రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఎదురుదాడి చేసి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని స్పష్టం చేసింది. పార్టీ బలోపేతానికి మంత్రులు పర్యటనలో జిల్లాల్లో జిల్లా కార్యాలయాలకు, హైదరాబాద్​లో గాంధీభవనకు తరచూ వచ్చేటట్లు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దాడిని ఎదురొడ్డి తిప్పికొట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.

మంత్రులతో పాటు సీనియర్ నాయకులు మల్లు రవి, జగ్గారెడ్డి, మధుయాస్కీ, హన్మంతరావు, మహేశ్​ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఆదివాసి నాయకుడు బెల్లయ్య నాయక్, దళిత విభాగం ఛైర్మన్ ప్రీతం, అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, అద్దంకి దయాకర్, భవాని రెడ్డి లాంటి గొంతెత్తి గళం విప్పే నాయకులు ఎదురు దాడి చేయాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని నాయకులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!

పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు

Last Updated : Jan 8, 2024, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details