తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి జలదీక్షపై కాంగ్రెస్ రహస్య వ్యూహరచన - telangana news

కాంగ్రెస్‌ పార్టీ శనివారం తలపెట్టిన గోదావరి జలదీక్షపై సందిగ్ధత నెలకొంది. ఆ పార్టీ నేతలు తలపెట్టే కార్యక్రమాలు పోలీసులు అడ్డుకోవడం వల్ల ఈసారి చేపట్టబోయే కార్యక్రమాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. పీసీసీ అధ్యక్షుడి ప్రక‌ట‌న మేర‌కు త‌మ కార్యక్రమం ఉంటుంద‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Congress plans ‘Godavari Jala Deeksha’ on June 13
గోదావరి జలదీక్షపై వీడని సందిగ్ధత

By

Published : Jun 12, 2020, 6:30 PM IST

గోదావరి జల దీక్షలో భాగంగా శనివారం కాంగ్రెస్ నేత‌లు ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించాల‌ని నిర్ణయించారు. గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి వాటి పురోగతిని ప‌రిశీలిస్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్షాన్ని ప్రజలకు తెలియ చేసేందుకు ఈ కార్యక్మాన్ని చేపడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ఈ సారి ఎలా చేస్తున్నారంటే...

కృష్ణా ప్రాజెక్టుల సంద‌ర్శన‌కు వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకోవ‌డం వల్ల...తాజాగా గోదావ‌రి ప్రాజెక్టుల సంద‌ర్శన విష‌యంలోనూ పోలీసులు ముంద‌స్తు అరెస్టులు చేసే అవ‌కాశముందని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ప్రాజెక్టుల సంద‌ర్శన త‌రువాత స్థానిక మీడియాతో ప్రాజెక్టుల స్వరూపం గురించి మాట్లాడాలని ఇప్పటికే పీసీసీ నాయ‌కుల‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఎవరెవరు ఎక్కడెక్కడంటే...

ప్రాజెక్టుల వారీగా తీసు‌కుంటే...ఆదిలాబాద్ జిల్లా ప్రాణహిత ప్రాజెక్టు స్థలం తుమ్మిడిహెట్టి వద్ద ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, స్థానిక నేత‌లు పాల్గొంటారు. ఎల్లంపల్లి వద్ద ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి... గౌరవల్లి జలాశయం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్​... ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్... దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే సీతక్క... దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​... అలిసాగర్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి సమీపంలో ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొంటార‌ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రక‌టించారు.

ఇవీ చూడండి:హైకోర్టులో రేవంత్​రెడ్డి ధిక్కరణ పిటిషన్

ABOUT THE AUTHOR

...view details